నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పోరేషన్’ చైర్మెన్‌గా ఏర్పుల నరోత్తమ్‌ను సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. మంత్రి తన్నీరు హరీశ్ రావు, ఏర్పులకు సంబంధిత నియామక పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తనకు చైర్మెన్‌గా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు నరోత్తమ్ ధన్యవాదాలు తెలిపారు.