
గ్రామీణ ప్రాంత మహిళలకు ఆర్థిక స్వశక్తికి ఎర్రబెల్లి దయాకర్ రావు చారిటబుల్ ట్రస్ట్ చేయూతగా నిరుస్తుందని ట్రస్ట్ చైర్మన్ ఎర్రబెల్లి ఉష దయాకర్ రావు అన్నారు. గురువారం మండలంలోని మండల కేంద్రంలో, కాట్రపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలందరూ ఆర్థికంగా ఎదిగినప్పుడే ఆర్థిక స్వాలంభన సాధ్యమని, మహిళా సాధికారత సాధ్యమని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఎర్రబెల్లి ట్రస్ మహిళాలకు సహాయం చేస్తుంది అన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఆడపిల్లలను చదివించాలని సూచించారు. వారు చదువుకుంటేనే సమాజంలో గౌరవంతోపాటు ఆర్థికంగా ఎదిగి, ధైర్యంగా బతకగలుగుతారని పేర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రజల మనిషి ఎర్రబెల్లి దయాకర్ రావు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామన్నారు అని హామీ ఇచ్చారు.