భిన్న కాన్సెప్ట్‌తో ఎస్కేప్‌

బాణాల క్రియేటీవ్‌ వర్క్స్‌ బ్యానర్‌ పై నిర్మించిన చిత్రం ‘ఎస్కేప్‌’. ఈ సినిమా బెస్ట్‌ స్టోరీ, బెస్ట్‌ యాక్ట్రెస్‌, బెస్ట్‌ మూవీ, బెస్ట్‌ డైరెక్టర్‌, బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌, బెస్ట్‌ కెమెరామెన్‌, బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌, బెస్ట్‌ ఫిమేల్‌ సింగర్‌ ఇలా దాదాపు 30 జాతీయ-అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది.
ఈ సందర్భంగా మేకర్స్‌ సిినిమా విశేషాలను షేర్‌ చేసుకోవడానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరోయిన్‌ శ్రుతి ఫులారి మాట్లాడుతూ,’మొదటి సినిమాకే ఇంత మంచి హీరోయిన్‌ పాత్ర రావడం, అందులోనూ సింగిల్‌ క్యారెక్టర్‌ మూవీ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా 5 భాషల్లో విడుదల అవుతుంది. సినిమా విడుదలకు ముందే ఇలా ఎన్నో అవార్డులు గెలుచుకోవడం అద్భుతమైన విషయం’ అని తెలిపారు.’ఈ సినిమాని కొత్త తరహ చిత్రీకరణ విధానంతో కేవలం పది రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేశాం. ప్రస్తుతం ఈ చిత్రం చివరి దశ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే మాంగో మ్యూజిక్‌ ద్వారా ఈ చిత్రంలోని రెండు పాటలని విడుదల చేశాం. అవి ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి’ అని ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ గౌతమ్‌ కుమార్‌ పీ.ఏ అన్నారు.
నిర్మాత టి.రామసత్యనారాయణ మాట్లాడుతూ,’వైవిధ్యమైన కథతో దర్శకులు శ్రీధర్‌ బాణాల ఎంతో క్రియేటీవ్‌గా తెరకెక్కించారు’ అని చెప్పారు. ఈ చిత్రానికి మ్యూజిక్‌ డైరెక్టర్‌ ప్రజ్వల క్రిష్‌ ఒక పాటని అందించగా, మరో పాటని వెంకట్‌ ఐనాల అందించారు. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ జె. భాను ప్రసాద్‌ సమకూర్చారు.