నేడు ఈసెట్‌ ఫలితాలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో బీటెక్‌, బీఈ, బీ ఫార్మసీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్‌ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలో లాటరల్‌ ఎంట్రీ ద్వారా 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈసెట్‌ ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల చేస్తారని ఈసెట్‌ కన్వీనర్‌ శ్రీరాం వెంకటేశ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మెన్‌ వి వెంకటరమణ, కార్యదర్శి ఎన్‌ శ్రీనివాసరావు, ఓయూ వీసీ దండెబోయిన రవీందర్‌ పాల్గొంటారని పేర్కొన్నారు. గతనెల 20న నిర్వహించిన ఈసెట్‌కు 22,454 మంది అభ్యర్థులు హాజరయ్యారు.