
భిక్నూర్ పోలీస్ స్టేషన్లో బిబిపేట్ మండలం నుండి బదిలీపై వచ్చిన ఎస్సై సాయి కుమార్ ను తెలంగాణ జాగృతి జిల్లా యూత్ అధ్యక్షులు శ్రీరామ్ వెంకటేష్ శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం శాంతి భద్రతల పరిరక్షణకు యువకులు పోలీసులకు సహకరించాలని ఎస్ఐ సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులు మనీష్ రెడ్డి, అనిల్, జస్వంత్, సాయి తేజ, నితీష్, తదితరులు పాల్గొన్నారు.