నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈనెల జూన్ 14 ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా జూన్ 8 వ తారీఖున గురువారం ఉదయం 10 గంటలకు బాలభవన్ లో పిల్లలకు వ్యాస రచన మరియు చిత్రలేఖనం పోటీలు నిర్వహించడం జరుగుతుంది అని నిజాంబాద్ జిల్లా శాఖ రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుస్సా ఆంజనేయులు సోమవారం ప్రకటనలో తెలిపారు. కావున సభ్యులు సకాలంలో హాజరు కావాలని తెలియజేశారు.