మద్నూర్ కేంద్రంలో ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయం ఓం ఓటింగ్ వాహనాల ఏర్పాటు

నవతెలంగాణ- మద్నూర్: కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎస్సీ రిజర్వుడు కాన్స్టెన్సీకి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు జుక్కల్ నియోజకవర్గం లోని ఏడు మండలాల పరిధిలో గల గ్రామాల్లోని వృద్ధులకు ఇంటి వద్దనే ఓటు హక్కు కల్పించేందుకు వాటికి కావలసిన ఓం ఓటింగ్ వాహనాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి మను చౌదరి ఐఏఎస్ అలాగే అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎండి ముజీబ్ మంగళవారం నాడు మద్నూర్ ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయం ఎదుట వాహనాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఓం ఓటింగ్ కోసం వాహనాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు.