ఏటూర్‌నాగారం డివిజన్‌ కేంద్రంగా ఫైర్‌ స్టేషన్‌ ఏర్పాటు

– ఉత్తర్వులు జారీ చేసిన చేసిన తెలంగాణ ప్రభుత్వం
– మంత్రులతోపాటు,ఎమ్మెల్సీ పోచంపల్లికి బీఆర్‌ఎస్‌ శ్రేణుల కృతజ్ఞతలు
నవతెలంగాణ- ములుగు
ములుగు జిల్లాలోని ఏటూర్‌నాగారం మండల కేంద్రాన్ని శనివారం రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయగా అదే ఏటూరునాగారంలో ఫైర్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏటూర్‌నాగారం కేంద్రంలో ఫైర్‌స్టేషన్‌ ఏర్పాటు చేయడంతో ఏజెన్సీ మండలాల ఎటునాగారం, మంగపేట, తాడ్వాయి, కన్నాయి గూడెం మండలాల ప్రజలు ఆనం దం వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగితే అనేక సందర్భాల్లో గిరిజన ప్రజలు సర్వస్వం కోల్పోయేది. ఏజెన్సీ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగితే ములుగు నుంచి ఫైర్‌ ఇంజన్‌ వెళ్ళల్లాలంటే కాలి బూడిదైనా తర్వాత అక్కడికి వెళ్ళేది. చాలా సందర్భాల్లో ప్రజాప్రతినిధులు, అక్కడి ప్రజలు ఏటూర్‌నాగారం కేంద్రంలో ఫైర్‌స్టేషన్‌ ఏర్పాటు చేయాలని ఆందోళన చేశారు. గతంలో కమలాపూర్‌ లోని రేయిన్స్‌ ఫ్యాక్టరీలో ఫైర్‌ ఇంజన్‌ ఉండేది, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగితే అది ఉపయోగపడేది.రేయిన్స్‌ ఫ్యాక్టరీ మూతపడిన తర్వాత అక్కడి ఫైర్‌ ఇంజన్‌ లేకపోవడంతో అనేక గిరిజన కుటుంబాలు అగ్ని ప్రమాదాలతో నష్టపోయాయి. ఎట్టకేల ప్రభుత్వం ఏటూరు నగరం కేంద్రంగా ఫైర్‌ స్టేషన్‌ మంజూరు చేయడం ఆ ప్రాంత ప్రజలు అదష్టంగా భావిస్తున్నారు. ఫైర్‌ స్టేషన్‌ మంజూరు చేసినందుకు ఆ ప్రాంత బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు, జెడ్పీ చైర్‌పర్సన్‌ నాగజ్యోతి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణరావు, ఆ ప్రాంత ఎంపీపీలు, సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఅర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు, సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, చైర్మన్లు ఏరువా సతీష్‌రెడ్డి, మెట్టు శ్రీనివాస్‌కు కతజ్ఞతలు తెలిపారు.