ఈటల….కాంగ్రెస్‌కు, బీజేపీకి రాజకీయ బ్రోకర్‌

గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌కు, బీజేపీకి రాజకీయ బ్రోకర్‌ ఈటల రాజేందర్‌ అని తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ చైర్మెన్‌ గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శించారు. సీఎం కేసీఆర్‌ రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ అంటూ ఈటల చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. పేద ఎస్సీ, ఎస్టీ, బిసీల దగ్గర అచ్చంపేట, మాసాయిపేట, హాకింపేటలో వందల ఎకరాలు రూ.6 లక్షలలోపే కొన్నానంటూ చెప్పిన ఈటల రాజేందరే నిజమైన రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ అని విమర్శించారు. ఆయనచేస్తున్నది బ్రోకరిజం అని తెలిపారు. తక్షణమే కేసీఆర్‌ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదంటే బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.