ఎమ్మెల్యేను కలిసినా సమగ్ర శిక్ష ఉద్యోగులు వినతి పత్రం అందజేత

నవతెలంగాణ- ఆర్మూర్: జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో  న్యాయపరమైన డిమాండ్లు అయిన రెగ్యులర్ /MTS సాధన కొరకు ఆర్మూర్ ఎమ్మెల్యే పియుసి చైర్మన్ ఆశన్నగారి జీవన్ రెడ్డి నీ శుక్రవారం అంకాపూర్ లో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి స్పందించిన ఆయన మా ముందే సంబంధిత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫోన్ మాట్లాడడం జరిగింది. సమగ్ర శిక్ష ఉద్యోగులు వచ్చారు వారి సమస్యలపై స్పందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు, సిఆర్పిల సంఘం ప్రధాన కార్యదర్శి అంజయ్య మహిళా అధ్యక్షురాలు గంగామణి, సునీల్, సునీత, ప్రమీల శ్రీనివాస్, జలంధర్ సంతోష్ శ్రీనివాస్ రాజేష్ రవి గంగాధర్ జైరాజ్ వివిధ మండలాల సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు..