పదవి కాలం ముగిసినా గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి : మంత్రి

నవతెలంగాణ-పెద్దకొత్తపల్లి
సర్పంచ్‌ పదవి కాలం ముగిసినా సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధిలో భాగస్వా ములై ముందుండాలని ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక మంత్రి జూపల్లి కృష్ణారావు సర్పంచ్లకు సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని నూతనగా నిర్మించిన ఎంపీడీవో కార్యాలయ హాలులో మండలంలోని సర్పంచుల సమావేశానికి అతిథు లుగా మంత్రితో పాటు ఎంపీపీ సూర్య ప్రతాప్‌ గౌడ్‌, జడ్పీటీసీ మేకల గౌరమ్మ చంద్రయ్య యాదవ్‌ అన్ని గ్రామాల సర్పంచులను శాలువాలతో సన్మానించి మెమొంటోలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంతకాలం గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన సర్పంచులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచులు భాగస్వాములై ముందుం డి గ్రామ సమస్యలపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దకొత్తపల్లి సర్పంచ్‌ ఆదేర్ల వెంకటేశ్వర్‌ రెడ్డి, వెన్నచర్ల సర్పంచ్‌ రాధా బాలస్వామి, దేవుని తిరుమలాపూర్‌ సర్పంచ్‌ వి.సత్యం, పెరమాల్లపల్లి సర్పంచ్‌ మానస విష్ణువర్ధన్‌ రెడ్డి, చిన్న కొత్తపల్లి సర్పంచ్‌ పెద్దిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, ముష్టిపల్లి సర్పంచ్‌ నాగమ్మ కురుమయ్య, ఆదిరాల సర్పంచ్‌ భాగ్యమ్మ కురుమయ్య, పెదకారపముల సర్పంచ్‌ శ్రీనివాస్‌ రెడ్డి, యాపట్ల సర్పంచ్‌ రామేశ్వరరావు, కొత్త యాపట్ల సర్పంచ్‌ దేవేందర్‌ తో పాటు సర్పంచ్‌లను, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు.
ఉప్పునుంతల : ప్రజలకు అందుబాటులో ఉండి అనునిత్యం సేవలు అందిం చిన వారిని ఎప్పుడు మరిచి పోరని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. బుధవారం ఎంపీపీ అరుణ నరసింహ రెడ్డి, పదవి కాలం ముగిస్తున్న సర్పంచులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రతాప్‌ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు బాలు నాయక్‌, ఎంపీడీవో లక్ష్మణ్‌ రావు, తిప్పర్తి నరసింహారెడ్డి, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి, కాల్వ గోవర్ధన్‌ రెడ్డి, యాదవ రెడ్డి, ఎంపీటీసీలు రెడ్డి రంగారెడ్డి, సంబు భాస్కర్‌, గోపిరెడ్డి, అనురాధ, శ్యామల, ఇటిక్యాల కవిత, తిరుపతి రెడ్డి, అన్ని గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
బిజినేపల్లి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను సక్రమంగా వినియోగించి పల్లెలను అభివృద్ధి పర్చడంలో సర్పంచ్లదే కీలక పాత్ర అని ఎంపీపీ శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీటీసీల సంఘం జిల్లా కన్వీనర్‌ మంగి విజయ్లు అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ సమావేశపు హాల్లో బుధవారంతో పదవి కాలం ముగిసిన సర్పంచ్లను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి మాట్లా డారు. అనంతరం పలువురు సర్పంచ్‌లు తమ అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కృష్ణయ్య, ఎంపీఓ రాములు నాయక్‌, సర్పంచ్లు బాలీశ్వ ర్‌, అశోక్‌, అవంతి, లావణ్య నాగరాజు, అమ్బత్‌ రెడ్డి, వంగ సుదర్శన్‌ గౌడ్‌, ముదా వత్‌ సాలెమ్మ, ఎంపీటీసీలు ఆంజనేయులు, తిరుపతయ్య, రాధా తిరుపతి రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.