ప్రణయ్ పోరాడినా..!

Even if Pranay fights..!– సెమీస్‌లో ఓడిన షట్లర్‌
– ప్రపంచ చాంపియన్‌షిప్స్‌
కోపెన్‌హాగన్‌ : ప్రపంచ బ్యాడ్మిం టన్‌ చాంపియన్‌షిప్స్‌లో హెచ్‌.ఎస్‌ ప్రణయ్ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో 21-18, 13-21, 14-21తో థారులాండ్‌ షట్లర్‌ కునాల్‌విట్‌ చేతిలో ప్రణయ్ పోరాడి ఓడాడు. మూడు గేముల పాటు సాగిన సెమీస్‌ పోరులో ప్రణయ్ 75 నిమిషాలు చెమటోడ్చినా.. ఫైనల్స్‌కు చేరలేకపోయాడు. తొలి గేమ్‌ను 21-18తో నెగ్గిన ప్రణరు.. రెండో గేమ్‌ను సులువుగా చేజార్చుకున్నాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సైతం ప్రణయ్ ఆకట్టుకోలేదు. 7-11తో వెనుకంజ వేసి.. విరామం అనంతరం పుంజుకోలేదు. సెమీస్‌లో ఓడిన ప్రణయ్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో తొలి మెడల్‌ సొంతం చేసుకున్నాడు.