ప్రతి ఒక్క మొక్కను సంరక్షించాలి 

నవతెలంగాణ -వీర్నపల్లి 
ప్రతి ఒక్క మొక్కను సంరక్షించాలని జెడ్పీటిసి గుగులోతు కళావతి తెలిపారు. వీర్నపల్లి మండలం కేంద్రంలో శనివారం ముఖ్య మంత్రి ఆదేశాల మేరకు ఒకేరోజు కోటి మొక్కలు హరితహారం లో బాగంగా ప్రజా ప్రతినిధులు అధికారులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జెడ్పీటిసి కళావతి ముఖ్య మంత్రి కేసీఅర్ నాయకత్వంలో ప్రపంచంలో ఎక్కడ లేని విదంగా హరితహారం కార్యక్రమం చేస్తున్నారన్నారు ,రాష్టం ఏర్పడక ముందు ఇరవై నాలుగు శాతం ఉన్న అటవీ నేడు ఇరువై తొమ్మిది శాతానికి పెంచిన ఘనత తెలంగాణ ప్రభుత్వం దే అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాటి దినాకర్, సెస్ డైరెక్టర్ మల్లేశం,ఉప సర్పంచ్ రవి , రాములు, బంజార సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ నాయక్, ఎ పి ఓ శ్రీహరి, ఎ ఎం సి మాజి వైస్ చైర్మన్ రాజేష్, ఎ ఎం సి డైరెక్టర్ లు రాజు, మండల నాయకులు తిరుపతి నాయక్, నవీన్, పృధ్వీ, టెక్నికల్ అసిస్టెంట్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.