– బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు భాస్కర్ యాదవ్
నవతెలంగాణ- కమ్మర్ పల్లి :
గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు భాస్కర్ యాదవ్ అన్నారు. శనివారం మండలంలోని కొన సముందర్ లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ముచ్చటగా మూడసారి బాల్కొండ ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత కార్యకర్తలదే అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి మండలంలోని అన్ని గ్రామాలు ఎంతో అభివృద్ధి సాధించాయన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించి, చేసిన అభివృద్ధి పనులు చెప్పడం ద్వారా మళ్లీ ప్రశాంత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యతను కార్యకర్తలు తమ భుజాలపై వేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి జనరంజక పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. పెన్షన్లు, రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్, తదితర సంక్షేమ పథకాలు అమలు, గ్రామంలోని జరిగిన అభివృద్ధిని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇంద్రాల రూప రాజేందర్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కాలేరు శేఖర్, ఉప సర్పంచ్ పేరం లింబాద్రి, సింగిల్ విండో చైర్మన్ సామా బాపురెడ్డి, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు అమర్, మాజీ ఎంపీపీ గుడిసె అంజమ్మ, సీనియర్ నాయకులు జగసంద్రం లక్ష్మి నరసయ్య, గుడిసే నారాయణ, తదితరులు పాల్గొన్నారు.