సినిమాకి అందరూ కనెక్ట్‌ అవుతున్నారు

Everyone is connecting to the movieఫీల్‌ గుడ్‌ లవ్‌ కాన్సెప్ట్‌తో దినేష్‌ తేజ్‌, హెబ్బా పటేల్‌, పాయల్‌ రాధాకష్ణ హీరో, హీరోయిన్లుగా వచ్చిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. విజన్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్‌ సమర్పించగా, కొమ్మాలపాటి సాయి సుధాకర్‌ నిర్మించారు. మారేష్‌ శివన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి విశేష ఆదరణ  పొందుతోంది. ఈ సందర్భంగా నిర్మాత సాయి సుధాకర్‌ మీడియాతో మాట్లాడుతూ, ‘మా సినిమాకు ఆడియెన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. మరీ ముఖ్యంగా విలేజ్‌ నుంచి ఎక్కువగా స్పందన వస్తోంది. వారంతా కూడా ఫస్ట్‌ హాఫ్‌కి ఎక్కువగా కనెక్ట్‌ అవుతున్నారు. ప్రేమ, లక్ష్యం మధ్య ఉండే సంఘర్షణ అనేది అందరి జీవితాల్లోనూ కామన్‌గా ఉంటుంది. సినిమా చూసిన చాలా మంది తమ జీవితాన్ని చూసుకున్నట్టుగా ఉందని అన్నారు. ఈ సినిమా బాగా తీశారని మా నాన్న మెచ్చుకోవడం ఆనందంగా ఉంది. నాకు నటన మీద నాలెడ్జ్‌ అంతగా లేదు. కానీ నేను తెరపై బాగుంటాను అని అందరూ అంటుంటారు. అందుకే నన్ను నేను టెస్ట్‌ చేసుకునేందుకు ఓ చిన్న పాత్రను పోషించాను. నా పాత్రకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. డైరెక్టర్‌ మారేష్‌ శివన్‌ మంచి కథను, డెప్త్‌ ఉన్న డైలాగ్స్‌ను రాసుకున్నారు. ఆయన రాసిన డైలాగ్స్‌కు థియేటర్లో మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సుభాష్‌ ఆనంద్‌ సంగీతం, ఆండ్రూ కెమెరాపనితనం ప్రధాన బలంగా నిలిచాయి’ అని తెలిపారు.