పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : కార్పొరేటర్‌

నవతెలంగాణ-అడిక్‌మెట్‌
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అని కార్పొరేటర్‌ పావని వినరు కుమార్‌ తెలిపారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో రాంకీ సంస్థ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన మేరా లైఫ్‌ మేరా స్వచ్‌ షేహర్‌”లి అనే ఉపశీర్షికతో లిస్వచ్‌ భారత్‌లో భాగంగా సెంటర్‌ను గాంధీ నగర్‌ జవహర్‌నగర్‌ కమ్యూనిటీ హాల్‌ ప్రాంగణంలో కార్పొరేటర్‌ పావని వినరు కుమార్‌ జీహెచ్‌ఎంసీ ముషీరాబాద్‌ ఎంహెచ్‌ఓ మైత్రితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన త్రిబుల్‌ ఆర్‌ సెంటర్‌ను పది రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పనికి రాని వస్తువులు, బట్టలు, ముఖ్యంగా ప్ల్యాస్టిక్‌ వ్యర్ధాలు ఎవరి ఇంట్లో ఉన్నా, వాటిని ఈ సెంటర్‌ లో అందించాలనీ, తమ ఇంటి అవరణలో కానీ, చెత్తా కుప్పల్లో కానీ పడవేయ కుండా, వాటిని ఈ సెంటర్‌లో అందించాలని కోరారు. తద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ హిత జీవన శైలి పై అవగాహన కల్పించేందుకు దోహదపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర యువ నాయకులు ఎ.వినరు కుమార్‌ జవాన్‌, లింగం, విజరు, రాజు, సోమేష్‌, శ్రీనివాస్‌, పారిశుధ్య సిబ్బంది, బీజేపీ నాయకులు నవీన్‌ కుమార్‌, ఆనంద్‌ రావు, ప్రశాంత్‌, తదితరులు పాల్గొన్నారు.