ఆలయ అభివృద్ధికి అందరు సహకరించాలి

నవతెలంగాణ-ధర్మసాగర్‌
శ్రీ ముఖ్యనాథస్వామి దేవాలయ అభివృద్ధికి అందరూ సహకరించాలని తెలంగాణ రాష్ట్ర విశ్వహిందూ పరిషత్‌ సాయి కార్యదర్శి డాక్టర్‌ రావినూతల శశిధర్‌ అన్నారు. ఆదివారం మండలంలోని ముప్పారం గ్రామంలో గ్రామ ఉద్యోగుల ఆత్మీయుల సమ్మేళన కార్యక్రమం దేవాలయ కమిటీ చైర్మన్‌ శివసాని ప్రవీణ్‌ రవీంద్ర ఆధ్వర్యంలో నిర్వ హించారు. ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యనాథస్వామి దేవాలయ అభివృద్ధి కోసం అందరూ ఐకమత్యంగా ఉండి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మహా శివలింగం పునఃప్రతిష్ఠ త్వరలో నిర్వహించాలని, ఈ కార్యక్రమం కోసం అందరూ సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వరంగల్‌ మహ నగర మఠ మందిర్‌ చిరు ప్రసాద్‌,దేవాలయ కమిటీ చైర్మన్‌ శివసాని ప్రవీణ్‌ రవీంద్ర, మాజీ ఎంపీటీసీ మేకల విజయ్ కుమార్‌, గౌరవ సలహా దారులు గడ్డం రాజయ్య, గొట్టి ముక్కుల సురేష్‌, ఉద్యోగులు కాసగొని ఉప్పలయ్య, దోమల భిక్షపతి, యాటల శ్రీనివాస్‌ హన్మకొండ లింగరావు, భీం రావు, కందిమల్ల నవీన్‌, భరత్‌, మామిడాల రాంచందర్‌, పరకాల రాజమౌళి, తదితరులు పాల్గొన్నారు.