ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి..

– అబిడ్స్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ఎల్ రవికుమార్
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ గా ఎల్ రవికుమార్ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధ నలను ప్రతి ఒక్కరూ పాటించాలని వాహనదారుల కు సూచించారు. అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు.