
నవతెలంగాణ – జమ్మికుంట
ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలని జెడ్పిటిసి డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ అన్నారు. శనివారం జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ గ్రామపంచాయతీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఒక్కరోజు కోటి మొక్కల నాటే కార్యక్రమం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా జమ్మికుంట జడ్పిటిసి సభ్యులు డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడవుల సంరక్షణ కోసం అనేక నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. జమ్మికుంట మండలంలో దాదాపు అన్ని గ్రామ పంచాయతీ పరిధిలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి అందులో భాగంగా అనేక రకాల మొక్కలను సంరక్షించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజీ షరీఫ్ సర్పంచ్ రాచపల్లి సదయ్య ఎంపీటీసీ సభ్యులు రాచపల్లి రాజయ్య ఎంపిఓ సతీష్ రావు కార్యదర్శి రాజేందర్ టెక్నికల్ అసిస్టెంట్ కవిత, నయీమ్, రమేష్,ఎర్ర రాజు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.