
బహుజన రాజ్యం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలనీ బిఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ఎనగందుల వెంకన్న అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ విసృత స్థాయి పార్టి కార్యకర్త లతో సమావేశంను శనివారం బిఎస్పీ మండల నాయకులు గజ్జెల ప్రశాంత్ అధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి ఎనగందుల వెంకన్న హాజరై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బహుజనుల ఓట్లతో అధికారంలోకి వచ్చి బహుజనులను మోసం చేస్తున్నాయన్నారు . కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర చేస్తుందన్నారు. బిఅర్ఎస్ ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో బిసి లకు తీరని నష్టం చేశారన్నారు . తెలంగాణ కోసం ఎంతో మంది పోరాటం చేసినా వారు ఉన్నప్పటికీ వారిని కాదని ఇది వరకు రెండు మూడు సార్లు గెలిచిన అభ్యర్థులకే మళ్ళీ టికెట్లు కేటాయించడం విడ్డూరం అన్నారు. బహుజన సమాజ్ పార్టీ బిసి లకు వారి జనాభా ప్రతి పాదికన ప్రకారం 60 నుంచి 70 సీట్లు ఇవ్వడానికి మా రాష్ట్ర రథసారథి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఇది వరకే ప్రకటించారనిన్నారు.అనంతరం జిల్లా ఇంఛార్జి మ్యాకల మునిందర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఓటర్లు చైతన్య వంతమై బీఎస్పీ పార్టి గెలిపించి తెలంగాణలో బహుజన రాజ్యం తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు మహేందర్, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రు నాయక్, సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల అశోక్, నియోజక వర్గ కార్యదర్శి ఇసంపల్లి కొమురయ్య,మండల అధ్యక్షులు గజ్జెల ప్రశాంత్, ఉపాధ్యక్షులు కొల్లపాక అనిల్,నాయకులు తిరుపతి, జనార్ధన్, సాయిలు, శ్రీనివాస్, సుధాకర్, శంకర్, సతీష్ , సంజయ్ లు తదితరులు పాల్గొన్నారు.