– ఎన్నికల తరుణంలో ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు అడుగులు
– గులాబీ సర్కారు వ్యూహారచన
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కాదేదీ కవితకు అనర్హం అన్నా డు శ్రీశ్రీ. ఇప్పుడు కాదేదీ ప్రచారా నికి అనర్హం అన్నట్టుగా వ్యవహరి స్తున్నది బీఆర్‌ఎస్ సర్కారు. ప్రతి ప్రభుత్వ పథకాన్ని ఎన్నికల ప్రచారా నికి ఉపయోగించుకోవాలని భావి స్తున్నది. ఆమేరకు గతంలో చేపట్టిన పథకాలు, మంజూరు ప్రాజెక్టు లకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారం భోత్సవాలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగానికి గ్రీన్ సిగల్ ఇచ్చేసింది. సెప్టెంబరు నుంచి సాధారణ ఎన్నికల నోటిఫికేష న్ వచ్చేవరకు ఉత్సవాల మాదిరిగా నిర్వహించాలంటూ మౌఖిక ఆదేశా లు జారీ చేసింది. భారత ఎన్నికల సంఘం(సీఈసీ) ఎన్నికల నోటిఫికే షన్ అక్టోబర్ రెండోవారం తర్వాత ఎప్పుడైనా రావచ్చనే ప్రచారం నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటు న్నది. ఒకవైపు రాజకీయంగా ప్రతి పక్షాలను ఇరుకున పెడుతూనే, మరోవైపు పథకాలు, ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల పేరుతో ప్రజల్లోకి చొచ్చుకెళ్లే వ్యూహారచన చేస్తోంది. పాలమూరు రంగారెడ్డి సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఈనెల 16న నార్లాపూర్‌లో వెట్‌రన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆసంద్భంగా బహిరంగ సభ నిర్వహించనున్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ మంజూరు చేసిన గులాబీ ప్రభుత్వం, ఇప్పటికే ఆయా జిల్లాల్లో సగం కళాశాలలను ప్రారం భించింది. ఈనెల మిగిలిన ఎనిమిది జిల్లాల్లో తరగతులు ప్రారంభించడం ద్వారా ప్రజల దృష్టిలో పడేలా కార్య క్రమాలకు రూపకల్పన చేస్తున్నది. దాదాపు అన్నింటికీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించేందుకు మంత్రులు రంగం సిద్ధం చేశారు. ఆయనకు వీలుకాకపోతే వర్చువల్‌గానైనా ముఖ్యమంత్రిని బాగస్వాములను చేయాలని నిర్ణయించారు. ఈనెల 15న కొత్త మెడికల్ కాలేజీల్లో మొదటి సంవత్సరం తరగతులను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించడా నికి ఏర్పాట్లు చేశారు. ఈవిషయాన్ని ఇప్పటికే మంత్రులు టి.హరీశ్‌రావు, కె.తారకరామారావు ప్రకటించారు. మహిళా సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందకు కొత్తగా మరో వంద మహిళా ఆరోగ్య కేంద్రాలను సీఎం మంజూరు చేశారు. అలాగే ఉపాధ్యా య పోస్టుల భర్తీ కార్యక్రమానికి సరిగ్గా ఎన్నికల ముందే శ్రీకారం చుట్టారు. ఐదు వేలకుపైగా పోస్టు లతో రెండో డిఎస్సీ నిర్వహించేందు కు సర్కారు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈమారు టీఎస్‌పీఎస్సీ ద్వారా కాకుండా నేరుగా జిల్లా ఎంపి క కమిటీ(డీఎస్సీ)లే నియామకాలు చేసేలా ఆదేశాలు ఇచ్చింది. డీఎస్సీని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రా రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇకపోతే పంచా యతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ విస్తరణ లో భాగంగా భారీగా కొత్త కార్యాల యాలను, పోస్టులను ముఖ్యమంత్రి మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కార్యాలయాల ప్రారంభో త్సవాలను శనివారం నుంచే చేప ట్టారు. ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు దాదాపు 87 కార్యాలయా లకు రిబ్బన్ కట్ చేయనున్నారు. ఈ కార్యక్రమం ఈనెల 12 వరకు మంత్రుల వీలును బట్టి ప్రారంభోత్స వాలను చేసేలా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో ఆ శాఖ భారీగా సంబరాలు నిర్వహించేం దుకు రాష్ట్రస్థాయిలో సన్నాహాలు చేసింది. ఈ ప్రతీ సందర్భాన్ని ఎన్నికల కోసం వినియోగించుకు నేలా మంత్రులు, ఎమ్మెల్యేలకు మార్గ దర్శకాలు వెళ్లాయి. ఇలా ప్రతి అంశా న్ని ఎన్నికల తరుణంలో బీఆర్‌ఎస్‌కు ఉపయోగపడేలా ప్రణాళికలు రూపొ ందిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యకార్యదర్శు లు, ఆయా జిల్లాల కలెక్టర్లకు సమాచారం పంపినట్లు బీఆర్‌ఎస్ శ్రేణులే చెబుతున్నాయి.