ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం- మాజీ మంత్రి

నవతెలంగాణ-భిక్కనూర్
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. బుధవారం మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన ఇతర పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ పథకాలను తక్షణమే అమలు చేయడం జరుగుతుందని, ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ తక్షణమే అమలు చేస్తుందని తెలిపారు. సాధ్యం కానీ హామీలతో సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని, మరోసారి వారికి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకన్న గారి బాగారెడ్డి, బస్వాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు సిద్ధిరాములు, నాయకులు శివకృష్ణమూర్తి, యాదగిరి, జీవన్, మల్లేష్, రవి, చంద్రం తదితరులు ఉన్నారు.