– సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం
నవతెలంగాణ -తుర్కపల్లి
ఆశా వర్కర్లకు ఎగ్జామ్‌ను వెంటనే రద్దు చేయాలని, పారితోషికాలను రూ.18,000 పెంచి ఫిక్సిడ్ వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర కమిటి ఇచ్చిన పిలుపు లో బాగంగా తుర్కపల్లి మండల కేంద్రం సీఐటీయూ లో వైద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ గర్భిణీ, బాలింతలు, చిన్నపిల్లలకు, ఇతర ప్రజలకు ఆశాలు సేవలందిస్తున్నారని,కరోనా మహమ్మారి కాలంలో కరోనాను నియంత్రించడంలో ఆశా వర్కర్లు కీలకపాత్ర పోషించారనీ,డబ్ల్యుహెచ్‌ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ గ్లోబల్ లీడర్స్ అని ఆశా వర్కర్లకు అవార్డును కూడా ప్రకటించిందని తెలియజేశారు.ఇన్ని పనులు నిర్వహిస్తూ,ఇంత సీనియారిటీ ఉన్న ఆశా వర్కర్లను కొత్తగా ఎగ్జామ్ నిర్వహిస్తామనడం సరికాదన్నారు. జూన్ 12 న కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించనున్నట్లు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటి సభ్యులు పోతరాజు జహంగీర్,మండల కన్వీనర్ తూటి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు .
మిర్యాలగూడ : ఆశాలకు పెట్టే ఎగ్జామ్స్ ను ప్రభుత్వం వెంటనే రద్దు చేసుకోవాలని ఆశ వర్కర్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం ఆశ నోడల్ అధికారులు, శారద కుమారి, ప్రకాష్ నగర్ పిహెచ్ సి వైద్యాధికారి ప్రసన్న లక్ష్మి లకు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఆశా వర్కర్లకు 18 వేలు పారితోషకం ఇవ్వాలని, ప్రతి నెల జీతం సక్రమంగా ఇవ్వాలని, అదనపు పనులు ఆశాలతో చేయించకూడదన్నారు. టీబీ స్ఫుటం డబ్బాలను ఆశాలతో చేయించే పనిని రద్దు చేయాలన్నారు. టీబీ, లెప్రసి, కంటి వెలుగు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు పని భారం తగ్గించి జాబ్ కార్డులు విడుదల చేయాలన్నారు పెండింగ్ పి ఆర్ సి ని వెంటనే విడుదల చేయాలని, కరుణ సమయంలో పెండింగ్లో ఉన్న అలవెన్స్ ఇవ్వాలన్నారు 32 రకాల రిజిస్టర్స్ వెంటనే ప్రింట్ చేసి ప్రభుత్వం సప్లై చేయాలన్నారు. ఐదు సంవత్సరాల నాణ్యమైన పెండింగ్ యూనిఫామ్ విడుదల చేయాలన్నారు ఆశ వర్కర్లకు ప్రసూతి సెలవులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు రమలక్ష్మీ, అమత లక్ష్మి, ప్రవీణ, స్వర్ణలత, రమాదేవి, డివైఎఫ్‌ఐ నాయకులు నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.