సోయా పంటను పరిశీలించిన 

– ఏడిఏ నూతన్ కుమార్ 

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండలంలోని లింగంపల్లి గ్రామంలో బుధవారం రోజున వ్యవసాయ అధికారి ఏడిఏ నూతన కుమార్ రైతు  సోయపంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సోదరులు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు సూచనలు పాటిస్తూ అధిక అధిక దిగుబడి రావాలంటే ముఖ్యంగా రసం పీల్చే పురుగులు కాండం తొలిచే పురుగులు వీటి నివారణకు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ మందులను పిచికారి చేయవలసినదిగా కోరుచున్నాను సోయా పంట లో పల్లాకు తెగులు తెల్ల దోమ ఆశించడం వలన వస్తూ ఉన్నది దీని నివారణకు మొదటగా పసుపు రంగు ఆకులు ఉన్న చెట్లను పీకి నాశనం చేయాలి తర్వాత పసుపు రంగు జిగురు అట్టలు ఎకరానికి పది చొప్పున అక్కడక్కడ అమర్చుకోవాలి దాని వలన దోమ ఎగిరినప్పుడు ఆ జిగురు పట్టాలకు మీద అతుక్కుని ఉండి పంటను నాశనం చేయదు దాని తర్వాత ఎసిఫేట్ కానీ డైఫెన్తురాన్ కానీ ఏసిట మై ప్రిడ్ మందును గాని తగిన మోతాదులో పిచికారి చేయాలి ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ శంకర్, విట్టల్వడి తండా సర్పంచ్ దీప్ చంద్, ఏఈఓ సునంద, పంచాయతీ సెక్రెటరీ రైతులు తదితరులు పాల్గొన్నారు.