బెల్ట్ షాపులపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం 


నవతెలంగాణ తలకొండపల్లి: ఆమన‌గల్ మండల పరిధిలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ కిందనున్న తలకొండపల్లిలోని అన్ని వైన్ షాపులు నాటు సారా తయారు చేసే విలేజెస్ సస్పెక్టెడ్ ప్లేసెస్లు, ఫామ్ హౌస్స్, ఫంక్షన్ హాల్స్, కోళ్ల ఫారాలు, రైస్ మిల్లులు అన్నింటిని తనీఖి చేశారు.  బుధవారం తలకొండపల్లిలోని ఆమనగల్ నుంచి షాద్ నగర్ రూట్లో  మోపెడ్ పై మద్యం తరలిస్తున్నట్టు అనుమానంతో ఆ బండి  ఆపి చెక్ చేయగా ఇంపీరియల్ బ్లూ 180 ఎంఎల్ 58 బాటిల్స్, బీరు 650 ml 24 బాటిల్లు లభ్యమయ్యాయి. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా అతని పేరు యాదయ్య అని, తండ్రి పోషయ్య అని, వీరిది మెదక్ పల్లి, తలకొండపల్లి మండలంగా తెలిసింది. వీటిని బెల్ట్ షాప్ లో అమ్ముటకు తీసుకెళ్తున్నానని వారు చెప్పారు. అక్కడే అతనిని అరెస్టు చేసి, కేసు రిజిస్టర్ చేశారు. ఎలక్షన్లో పంచుటకు గాని నిల్వ చేయుటకు గాని అనాథరైజ్ అవుట్లెట్లో లిక్కర్ అమ్మిన ఎక్కువ మొత్తంలో ఎవరైనా తీసుకెళ్లిన వాళ్ల పైన కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న ఎలక్షన్ లో మద్యం ఓటర్లకు పంచడానికి ఎక్కువ మొత్తంలో ఎక్కడైనా డంప్ చేస్తే వెంటనే ఎవరైనా ఎక్సైజ్ కంట్రోల్ రూమ్ గాని ఎక్సైజ్ స్టేషన్ అమనగల్ కానీ ఈ కింది నెంబర్లకు 8712658742 ,9000571671 సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ, ఎస్ఐ యాదయ్య , ఎస్సై స్వప్న, దశరథ్ కానిస్టేబుల్స్, సురేష్ బాబు, లోక్య, బాలస్వామి, బాబు తదితరులు పాల్గొన్నారు.