బాయిలర్‌ పెరుగు ప్లాంట్‌ విస్తరణ ప్రారంభం

నవతెలంగాణ -ఆలేరుటౌన్‌
నార్మల్‌ మదర్‌ డెయిరీ పెరుగు ప్లాంట్‌ బాయిలర్‌ను రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్‌ రెడ్డి గురువారం నార్మల్‌ మదర్‌ డైరీ చైర్మెన్‌ లింగాల శ్రీకర్‌ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం నల్లగొండ, రంగారెడ్డి నూతన బ్రాండ్‌ పాల ప్యాకెట్లను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో నార్మల్‌ డెయిరీపాలకవర్గ సభ్యులు, దొంతిరి సోమిరెడ్డి, ఎ.గాలిరెడ్డి, కే రామ్‌ రెడ్డి, సిహెచ్‌ వెంకటరామారెడ్డి,పి వెంకటరామరెడ్డి, సిహెచ్‌ సురేందర్‌ రెడ్డి, కే జయశ్రీ, ఉప్పల్‌ వెంకట్‌ రెడ్డి, ఆర్‌. లక్ష్మీనరసింహారెడ్డి కే.జలంధర్‌ రెడ్డి, కే. అలివేలు, రంగారెడ్డి, శ్రీధర్‌ రెడ్డి, పాండు,రామ్‌ రెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.