ఆశీర్వదిస్తే అభివద్ధి చేసి చూపిస్తా

-తూర్పు గూడెం గ్రామాన్ని దత్తత తీసుకుంటా
– టీసీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీర్ల ఐలయ్య
నవతెలంగాణ -ఆలేరు రూరల్‌
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు కాంగ్రెస్‌ పార్టీకి ఒకసారి ఎమ్మెల్యేగా ఒకసారి ఛాన్స్‌ ఇస్తే అభివద్ధి చేసి చూపిస్తానని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీర్ల ఐలయ్య అన్నారు .శుక్రవారం మండలంలోని తూర్పు గూడెం గ్రామంలో నీటి శుద్ధికరణ కేంద్రం బీర్ల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రారంభించారు ముందుగా కాంగ్రెస్‌ పార్టీ జెండా ఆవిష్కరించి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండుసార్లు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ను ఆలేరులో గెలిపిస్తే అభివద్ధి ఏమి చేసిందని ప్రశ్నించారు. ఆలేరు నియోజకవర్గం లో 160 వాటర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఫ్లోరిన్‌ సమస్య లేకుండా చేశానని తెలిపారు. ఆలేరులో ఎమ్మెల్యేగా గెలిపిస్తే తూర్పు గూడెం గ్రామాన్ని దత్తత తీసుకుంటానని తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అశోక్‌ ,మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు ,గ్రామ సర్పంచ్‌ శ్రీశైలం ,ఎంపీటీసీ లు నరేందర్‌ రెడ్డి ,లక్ష్మీ రా మల్లయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు లగ్గాని మురళి, ఎస్సీ సెల్‌ మండల ప్రధాన కార్యదర్శి అందే అఖిల్‌, మాజీ సర్పంచ్‌ నర్సింలు, నాయకులు వల్లపు ఉప్పలయ్య, తండా నర్సింలు, గాజుల దశరథ, సంజీవరెడ్డి ,బంధారపు మధు, నర్సింగరావు, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love