టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, నాగమణి
నవతెలంగాణ -నల్లగొండ కలెక్టరేట్
దేశ అత్యున్నత న్యాయస్థామైన సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన నేటికీ అమలు చేయడం లేదని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ఎం. రాజశేఖర్ రెడ్డి, జి.నాగమణిలు విమర్శించారు.కేజీబీవీ , యూఆర్‌ఎస్ లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆ సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.అనాధ, వెనకబడిన బాలికలకు విద్యను అందించడం కోసం 2013లో ఏర్పాటు చేసిన కస్తూరిబా బాలిక విద్యాలయాలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది కి సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా అరకోర వేతనాలను చెల్లిస్తూ శ్రమదోపిడి చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఇచ్చిన బేసిక్ పే ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తే మిగతా ఉద్యోగులకు మెడికల్ రియంబర్స్మెంట్, హెల్త్ కార్డులు ఉన్నాయని కానీ కేజీబివి, యుఆర్‌ఎస్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బందికి ఎలాంటి సదుపాయం లేదని ఆవేదన చెందారు. వారికి హెల్త్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావుకు వినతిపత్రం అందజేశారు.
యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కేజీబీవీ నూతన సబ్ కమిటీ
యూటీఎఫ్ నల్లగొండ జిల్లాకేజీబీవీ నూతన సబ్ కమిటీని ఎన్నుకున్నారు.నల్లగొండ జిల్లా కన్వీనర్ గా రమావత్ సుశీల, కో కన్వీనర్స్ గా జె. కల్పన, ఎం. శంకరమ్మ, లక్ష్మీ కాంతమ్మ, బి. ప్రభాకర్,పార్వతిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎడ్ల సైదులు, పెరుమాళ్ళ వెంకటేశం, జిల్లా ఉపాధ్యక్షురాలు బి.అరుణ, కోశాధికారి ఎన్. శేఖర్ రెడ్డి జిల్లా కార్యదర్శి గేర నరసింహ, నలపరాజు వెంకన్న, జిల్లా కమిటీ సభ్యులు వై. సైదులు, పగిడిపాటి నరసింహ, రాకేష్, పి. సైదులు, రవీందర్, కేజీబీవీ ఉపాధ్యాయులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.