మణిపూర్‌ మంత్రి ఇంటి ఎదుట పేలుడు..

Explosion in front of Manipur minister's house– సీఆర్పీఎఫ్‌ జవాన్‌, మహిళకు గాయాలు
ఇంఫాల్‌: బీజేపీ పాలిత మణిపూర్‌ లో హింసాత్మక సంఘటనలు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర మంత్రి ఇంటి బయట బాంబు పేలింది. ఈ సంఘటనలో సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ ( సీఆర్పీఎఫ్‌) జవాన్‌, ఒక మహిళ గాయపడ్డారు. రాజధాని ఇంఫాల్‌లో ఈ సంఘటన జరిగింది. శనివారం రాత్రి పది గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వచ్చాడు. బీజేపీ ఎమ్మెల్యే, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివద్ధి శాఖ మంత్రి యుమ్నం ఖేమ్‌చంద్‌ నివాసం వెలువల గేటు వద్ద గ్రెనేడ్‌ వంటి బాంబు విసిరాడు. అది పేలడంతో అక్కడ సెక్యూరిటీగా ఉన్న సీఆర్పీఎఫ్‌ జవాన్‌, స్థానిక మహిళ గాయపడ్డారు కాగా, ఈ పేలుడు గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి ఎన్‌ బీరెన్‌ సింగ్‌ సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. మంత్రి ఇంటి బయట పేలుడు నేపథ్యంలో భద్రతను మరింత పెంచారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేసి నిందితుడ్ని పట్టుకుంటామని పోలీస్‌ అధికారి తెలిపారు.