సబ్బనిలతను సీపీఐ(ఎం) నుండి బహిష్కరణ

నవతెలంగాణ-కంటేశ్వర్
సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నాయకురాలుగా ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సబ్బని లతను సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కమిటీ నుండి మహిళా సంఘం నుండి బహిష్కరించడం జరుగుతున్నది. ఇతర రాజకీయ పార్టీలోకి వెళ్లినందున పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినందున పార్టీ నుండి బహిష్కరించటం జరిగిందని ఇకనుండి పార్టీకి గానీ ఐద్వా మహిళా సంఘానికి గాని ఎటువంటి సంబంధం లేదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ .రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.