
ఎన్నికల కోడ్ నేపథ్యంలో మండలంలోని లక్నవరం పర్యాటక కేంద్రం రహదారిలో ఆదివారం ఫ్లైయింగ్ స్క్వాడ్ సిహెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహనాలను విస్తృతంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుండి ఇతర దూర ప్రాంతాల నుండి లక్నవరం పర్యాటక కేంద్రానికి సెలవు దినాల్లో వాహనాల లో పర్యాటకులు వస్తుంటారు. దీనిలో భాగంగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో నగదు లావాదేవీలు జరిగే ఆస్కారం ఉన్నందున తాము ఈ తనిఖీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వాహనాల యజమానులు తమ తనిఖీలకు పూర్తిస్థాయిలో సహకరించాలని శ్రీనివాస్ సూచించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ అల్లం బాలయ్య వీడియో గ్రాఫర్ జనగాం రాజు తదితరులు పాల్గొన్నారు.