ఏజెన్సీ గ్రామాల్లో పోలీస్ బాస్ ల విస్తృత పర్యటన

– వివిధ శాఖల అధికారుల సమన్వయంతో అభివృద్ధికి కృషి
– అసాంఘిక శక్తులకు సహకరించొద్దు
– ములుగు ఓ ఎస్ డి అశోక్ కుమార్
నవతెలంగాణ -తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని దట్టమైన అడవి ప్రాంతంలో గల బంధాల ఏజెన్సీ మారుమూల గ్రామాలు పోచాపూర్, నర్సాపూర్(పిఎల్), అల్లిగూడెం, బొల్లెపల్లి ఆదివాసి గ్రామాలను బుధవారం ములుగు ఓఎస్డి అశోక్ కుమార్, ములుగు డి.ఎస్.పి రవీందర్, పస్రా సీఐ వి శంకర్, స్థానిక ఎస్సై వెంకటేశ్వరరావు లతో కలిసి సందర్శించి, పరిశీలించారు. ఏజెన్సీ గ్రామాల్లోని అక్కడి ఆదివాసి లా జీవన విధానం, వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. నర్సాపూర్(పిఎల్) చిన్నపిల్లలకు, విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు బిస్కెట్ ప్యాకెట్లు అందించారు. నర్సాపూర్ గ్రామస్తులు వారి గ్రామానికి పస్రా- లింగాల రోడ్డును నర్సాపూర్ వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు. మిషన్ భగీరథ నీరు ఉండడం లేదని, చదువుకున్న విద్యార్థులు నిరుద్యోగులుగా ఉన్నారని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని గ్రామస్తులు కోరారు. దీనికి స్పందిస్తూ పోలీస్ బాస్ ఓ ఎస్ డి అశోక్ కుమార్ మాట్లాడుతూ ఏ సమస్య అయినా ఆయా శాఖల అధికారుల సమన్వయంతో అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిరుద్యోగుల లిస్టు తయారుచేసి ఆసక్తిని బట్టి జాబు మేళా నిర్వహిస్తామని పేర్కొన్నారు. సందర్భంగా ఓ ఎస్ డి అశోక్ కుమార్ మాట్లాడుతూ యువత ఎవరు అసాంఘిక శక్తులకు సహకరించవద్దని, ఎవరైనా కనబడితే వెంటనే పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఆదివారం గ్రామంలోని ప్రతి ఒక్కరూ విద్యావంతులై ఉన్నత శిఖరాల అధిరోహించాలని సూచించారు. ఆటలలో ఆసక్తి ఉన్న విద్యార్థులకు, యువతకు స్పోర్ట్స్ మీట్లు చేసుకోవాలని కోరారు. విప్లవ పార్టీలకు ఆకర్షకులు కావద్దని వారి వల్ల సమాజానికి ఒరిగిందేమీ లేదని అన్నారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే మిగతా శాఖల సమావేశం తో వారి వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు డిఎస్పి రవీందర్, పసర సీఐ వంగ శంకర్, తాడ్వాయి స్థానిక ఎస్సై వెంకటేశ్వరరావు, సివిల్, సిఆర్పిఎఫ్ పోలీస్ లు తదితరులు పాల్గొన్నారు.