హుస్నాబాద్ లో విస్తృతంగా వాహనాల తనిఖీ

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ 

హుస్నాబాద్ లో  సిఐ ఏర్రల కిరణ్ సిబ్బందితో కలిసి ఆదివారం పట్టణంలో వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, మల్లె చెట్టు చౌరస్తా, అంబేడ్కర్ చౌరస్తాలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు .సరైన వాహన ధ్రువపత్రాలు లేనివారికి జరిమానాలు విధించారు. వాహనాదారులు ధ్రువపత్రాలు కలిగి ఉండాలని మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ కిరణ్ తెలిపారు. త్రిబుల్ రైడింగ్, మైనర్లకు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని అన్నారు. పెండింగ్ లో ఉన్న ఈ చాలన్లు సకాలంలో చెల్లించాలన్నారు. హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట ప్రాంతాల వాహనదారులు తప్పకుండా రోడ్డు రవాణా, ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. సరైన ధ్రువపత్రాలు లేని 15 వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించి, వాహనాదారులకు జరిమానాలు విధించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మహేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.