
నవతెలంగాణ -డిచ్ పల్లి
న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పరిష్కారించాలని, పంచాయతీ కార్మికుల దిక్షలకు బిఎస్పీ సంపుర్ణ మద్దతును ప్రకటించింది. గురువారం డిచ్ పల్లి మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్ వద్ద గ్రామ పంచాయతీ కార్మికుల దిక్ష శిబిరంకు చేరుకుని తమ సంపూర్ణ మద్దతు ను ప్రకటించారు. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ కళా శ్రీనివాస్ ఆధ్వర్యంలో బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశానుసారం జిల్లా కమిటీ సూచనతో ఆయా మండల కేంద్రాలలో గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనకు కొనసాగుతున్న దీక్ష శిబిరాలను సందర్శించి సంపూర్ణ మద్దతును ప్రకటించాలనే పిలుపులో భాగంగా మద్దతు ప్రకటించామని, చలిచలని వేతనాలతో కుటుంబలను పోషించు కుంటున్నాయి, గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ నేరవేర్చాలని అయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ నాయకులు, హర్షద్ బాయ్, ప్రభుదాస్, రణవీర్ తదితరులు పాల్గొన్నారు.