మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..

నవతెలంగాణ – డిచ్ పల్లి.
నిజామాబాద్ జిల్లా లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో మిగిలిన ఇంటర్ ప్రథమ సంవత్సరం సీట్ల భర్తీకి ఈ నెల 6 నుంచి 15వ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సమన్వయకర్త బి సంగీత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినులు www.tswreis.ac.in site లో దరఖాస్తు ఫీజు కింద100 రూపాయలను క్రెడిట్ కార్డు,డెబిట్ కార్డు, లేదా లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సంగీత సూచించారు. పదో తరగతిలో పొందిన జిపిఎ ఆధారంగా సీట్లను భర్తీ చేయబడుతుందని సంగీత వివరించారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Spread the love