కుల్కచర్లలో నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్టు పట్టివేత

Fake ginger and garlic paste pattiveta in kulkacharనవతెలంగాణ-కుల్కచర్ల
ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే నకిలీ సరుకులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని పరిగి డీఎస్పీ కరుణాసాగర్‌రెడ్డి అన్నారు. డీస్పీ విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం..మండల కేంద్రంలో పూసల రాము అనే వ్యక్తి నకిలీ అల్లం పేస్ట్‌ అమ్ము తున్నాడని, సమాచారం రావడంతో ఎస్సె శ్రీశైలం తన సిబ్బందితో కలిసి అతనిని అదుపులోకి తీసుకొని విచారించారు. హైదరాబాద్‌లోని కుషాయిగూడకు చెందిన భాను ప్రసాద్‌ నాగారం కాలనీలో తన గోదాంలో నకిలీ అల్లం పేస్టును తయారుచేసి తక్కువ ధరకు అమ్మే మవా డు.భాను ప్రసాద్‌ నుంచి పూసల రాము అనే వ్యక్తి నకిలీ అల్లం పేస్టును కొని పలు మార్కెట్లలో అమాయక ప్రజలకు అమ్మేవాడు. కుల్కచర్లలో పూసల రా ము అనే వ్యక్తి దగ్గర 200 కిలోల నకిలీ అల్లం పేస్టును, హైదరాబాదులో భా ను ప్రసాద్‌ గోదాంలో 240 కిలోల అల్లం పేస్ట్‌, 40 కిలోల వెల్లుల్లి, 11/2 కేజీల సెట్రిక్‌ యాసిడ్‌, 2 కేజీల నిమ్మ ఉప్పు, 100 ఎంఎల్‌ ఎసిటిక్‌ యాసిడ్‌ కెమికల్‌ను స్వాధీనం చేసుకుని, ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తర లించినట్లు డీస్పీ తెలిపారు. కుల్కచర్ల శ్రీశైలం, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.