బీఆర్ఎస్ పై అసత్యపు ఆరోపణలు మానుకోవాలి

నవతెలంగాణ-వీణవంక
బీఆర్ఎస్ పార్టీపై, సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేస్తున్న అసత్యపు ఆరోపణలు మానుకోవాలని మండల బీఆర్ఎస్ నాయకులు సూచించారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశలో వారు మాట్లాడరు. ఎన్నికల కోసమే దళిత బంధు పథకం అంటే నియోజకవర్గంలోని అన్ని కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులందరికీ సాగు నీరు అందించడంతో పాటు ఉచిత కరంటు అందిస్తున్నట్లు వివరించారు. బీఆర్ఎస్ పై ఆరోపణలు మానుకోని తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుండి ప్రత్యేక నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలన్నారు. ఈ కార్యక్రమములో నాయకులు ముసి పట్ల రేణుక తిరుపతి రెడ్డి, జెడ్పిటిసి మాడ వనమాల సాదవరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు మావురపు విజయ బాస్కర్ రెడ్డి ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కట్కూరి మదుసూదన్ రెడ్డి, చెక్క బండి శ్రీనివాస్ రెడ్డి, అడిగొప్పుల సత్యనారాయణ, ఒడ్డెపల్లి భూమయ్య, ఒరెం భానుచందర్, తాళ్లపల్లి మహేష్, పోతుల సురేష్ తదితరులు పాలొన్నారు.