జస్టిస్‌ అభిషేక్‌రెడ్డికి వీడ్కోలు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సుప్రీంకోర్టు సిఫార్సులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన బదిలీ ఉత్తర్వులతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏ అభిషేక్‌రెడ్డి పాట్నా హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు శుక్రవారంనాడాయనకు ఘనంగా వీడ్కోలు చెప్పింది. చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ అధ్యక్షతన సమావేశమైన ఫుల్‌కోర్ట్‌ ఆయన సేవల్ని కొనియాడింది. అనంతరం జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి దంపతులకు చీఫ్‌ జస్టిస్‌ భూయాన్‌ దంపతులు జ్ఞాపికను అందజేశారు. హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ కూడా అభిషేక్‌రెడ్డిని సన్మానించింది.