
తనకు ఉన్న పొలంతో పాటు కౌలుకు తీసుకున్న మూడున్నర ఎకరాల పొలంలో పత్తి పంట సాగు చేసి అప్పుల పాలు కావడంతో మనస్థాపానికి గురైన దయ్యాల శ్రీశైలం అనే రైతు పురుగుల మందు తాగి మృతి చెందిన సంఘటన ఊరుకొండ మండల పరిధిలోని మాదారం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మాదారం గ్రామానికి చెందిన దయ్యాల శ్రీశైలం (45) అనే రైతు తనకున్న రెండు ఎకరాల పొలంతో పాటు మూడున్నర ఎకరాలు కౌలుకు తీసుకొని పంట సాగు చేయడంతో పాటు తనకున్న పాత ఇల్లును మరమ్మతులు చేసి సుమారు ఐదు లక్షలు అప్పు చేశాడు. దీంతో వర్షాలు పడక తాను సాగుచేసిన పంట చేతికి వస్తుందో లేదోననీ భయాందోళనకు గురై తాను చేసిన అప్పులు తీర్చలేనని సోమవారం సాయంత్రం వ్యవసాయ పొల వద్దకు పాలు పితికేందుకు వెళ్లి గుర్తుతెలియని పురుగుల మందు తాగి గ్రామానికి చెందిన రామకృష్ణ కి ఫోన్ చేసి నేను హత్య చేసుకుంటున్నానని చెప్పడంతో అతన్ని వెంటనే బైక్ పై ఊర్లోకి తీసుకొచ్చారని.. తన భార్య రాములమ్మ మరి కొంతమంది బంధువులు చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా . పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వెల్దండలోని ఎన్నోమ్స్ ఆసుపత్రికి తరలించారని తెలిపారు. దయ్యాల శ్రీశైలం మార్గమధ్యలోనే మృతి చెందాలని ఎస్సై లెనిన్ తెలిపారు. మృతుడి భార్య దయ్యల రాములమ్మ ఆ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.