వరి పంటకు దోమ పోటు, ఆందోళనలో రైతన్నలు.

నవతెలంగాణ- రెంజల్:
ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికి వచ్చింది అనుకున్న తరుణంలో దోమ పోటు రావడంతో రైతన్నలు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని సాటాపూర్ శివారుతోపటు, నీలా శివారులో దోమపోటు ఉదృతి రోజురోజుకు పెరుగుతుండడంతో స్థానిక రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక వ్యవసాయ విస్తీర్ణ అధికారులు చేతికి వచ్చిన పంట పొలాలను పరిశీలించి రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని వారు పేర్కొంటున్నారు. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి ఇక చేతికి వస్తుందన్న తరుణంలో దోమ పోటు రావడం రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. సంబంధిత వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యటించి రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని వారు కోరుతున్నారు.