ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ-తూప్రాన్‌ రూరల్‌ (మనోహరాబాద్‌)
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని అలాంటి ముఖ్యమంత్రికి ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలని జడ్‌పీ చైర్‌పర్సన్‌ ర్యాకల హేమలత శేఖర్‌గౌడ్‌ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం సందర్బంగా చేపట్టిన దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం మనోహరాబాద్‌, కూచారం గ్రామాలలోని రైతు వేదికలు, గ్రామాల నుంచి తరలివచ్చిన రైతులు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్‌లను సుందరంగా అలంకరించి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక శుభం గార్డెన్ప్‌లో ఏర్పాటు చేసిన రైతు దినోత్సవ సమావేశంలో రాష్ట్ర అటవీ అభివృద్ది కార్పోరేషన్‌ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర మాజీ ఫుడ్స్‌ చైర్మన్‌ గంగుమల్ల ఎలక్షన్‌రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏ ఒక్క రైతుకూడా అప్పుల పాలు కాకూడదని, రైతు సంక్షేమంగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక రైతు సంక్షేమ పధకాలను తీసుకువచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండలాల పీఏసీఎస్‌ చైర్మన్‌ మెట్టు బాలక్రిష్ణారెడ్డి, మండల స్పెషల్‌ ఆఫీసర్‌ కృష్ణమూర్తి, తహశీల్దార్‌ భిక్షపతి, డిప్యూటీ తహశీల్దార్‌ శ్రీకాంత్‌, ఎంపీడీవో యాదగిరిరెడ్డి, ఎంపీపీ పురం నవనీత రవిముదిరాజ్‌, వైస్‌ ఎంపీపీ యంజాల విఠల్‌రెడ్డి, ఎంపీటీసి లతా వెంకట్‌గౌడ్‌, రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం వర్కింగ్‌ ప్రసిడెంట్‌ చిట్కుల్‌ మహిపాల్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు బాషబోయిన చంద్రశేఖర్‌ముదిరాజ్‌, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్‌ యంజాల సుధాకర్‌రెడ్డి, ఎంపీవో లక్ష్మి నర్సింలు, సర్పంచ్‌ జక్కిడి నరెందర్‌రెడ్డి, పంజా భిక్షపతి. ఆంజనేయులు, నాగిరెడ్డి, ఏపీఎం పెంటాగౌడ్‌, ఏపీఎం ఆదినారాయణ, ఆత్మా కమిటీ డైరెక్టర్‌ బండారు భిక్షపతి, మన్నె దర్మెందర్‌, శ్రీహరిగౌడ్‌లతో పాటు అధిక సంఖ్యలో నాయకులు మహిళలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-హవేలీ ఘనాపూర్‌
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల సంక్షేమం కోసం నిరంతరం కషి చేస్తున్నారని, రైతులకు అందుబాటులో ఎరువులు విత్తనాలు సరఫరా చేస్తున్నారని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని బూరుపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా ఆమె పాల్గొన్నారు. ఎమ్మెల్యే పద్మ దేవేందర్‌ రెడ్డి మాట్లాడుతూ రైతులను దష్టిలో ఉంచుకొని రైతు బీమా, రైతు బంధు లాంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్‌ నవీన్‌ కుమార్‌, ఎంపీడీవో శ్రీరామ్‌, స్పెషల్‌ ఆఫీసర్‌ విజయలక్ష్మి సర్పంచులు భాగ్యలక్ష్మి శ్రీనివాస్‌, యామిరెడ్డి, కిషన్‌ నాయక్‌, సరిత సాయ గౌడ్‌, సంధ్యారాణి సాయిలు ఎంపిటిసి అర్చన శ్రీనివాస్‌, జ్యోతి సిద్ధారెడ్డి, స్వప్న దుర్గారావు, సొసైటీ డైరెక్టర్‌ సాప సాయిలు, బీఆర్‌ఎస్‌ మండల ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌ రెడ్డి, బాలరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.
బ్యాతోల్‌లో.. ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ వ్యవసాయ రంగం సాధించిన పురోగతిని ప్రజల ముందు ఉంచాలని లక్ష్యంగా ఈ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో ప్రభుత్వం రైతు దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్సీ సుభాష్‌ రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని బ్యాతోల్‌ గ్రామంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతులకు అందించిన విప్లవాత్మక సంక్షేమ పథకాలైన రైతు బీమా, రైతు బంధుల గురించి, 24 గంటల ఉచిత కరెంటు, పెరిగిన వ్యవసాయ ఎగుమతుల గురించి రైతులకు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సుజాత శ్రీనివాస్‌ రెడ్డి,స్థానిక సర్పంచ్‌ శ్రీనివాస్‌,అగ్రికల్చర్‌ ఏడి విజయనిర్మల,సర్పంచులు మహిపాల్‌ రెడ్డి, బి ఆర్‌ ఎస్‌ మండల నాయకులు బోయిని రాజు శ్రీను నాయక్‌,పూల్సింగ్‌ నాయక్‌,రాజు, గోపాల్‌ రావు, కృష్ణారెడ్డి జనార్దన్‌ రెడ్డి,శంకర్‌ నాయక్‌,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రుక్మారెడ్డి,ఉప సర్పంచ్‌ ఏసు రెడ్డి తదితరులు ఉన్నారు.
నవతెలంగాణ-నిజాంపేట
మండల కేంద్రంతో పాటు నస్కల్‌, కల్వకుంట, గ్రామాలలో శనివారం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజాంపేట నస్కల్‌ గ్రామాలలోని రైతు వేదిక వద్దకు ఎడ్లబండ్లతో నాయకులు రైతులు డప్పు చప్పుల మధ్య ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని పదో సంవత్సరంలోకి అడిగిడుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల స్పెషల్‌ అధికారి సాయి బాబా, మండల ఎంపీపీ దేశెట్టి సిద్ధ రాములు, తహసిల్దార్‌ ప్రభాకర్‌, ఆర్‌ ఐ గంగాధర్‌ గౌడ్‌, ఆయా గ్రామాల సర్పంచులు పంగా కవిత,అనూష, బాల్‌ నరసవ్వ,నరసింహారెడ్డి, లక్ష్మీ నరసవ్వ ,అరుణ్‌ కుమార్‌, ఎంపీటీసీలు బాల్రెడ్డి,లహరి రెడ్డి,సురేష్‌, మండల అధ్యక్షులు పరిపాటి సుధాకర్‌ రెడ్డి, సొసైటీ చైర్మన్లు కొండల్‌ రెడ్డి, బాపురెడ్డి, వైస్‌ చైర్మన్‌ సులోచన వెంకట స్వామి గౌడ్‌, రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షులు బీజ్జా సంపత్‌, చంద్రయ్య, విజరు, ఏపీఎం వెంకటస్వామి, కార్యదర్శిలువెంకట నరసింహారెడ్డి, నర్సింలు,ఆరీఫ్‌ హుస్సేన్‌,భాగ్యలక్ష్మి,మాధవి, బిఆర్‌ఎస్‌ నాయకులురైతులు నందగోకుల్‌ బాల్‌ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-టేక్మాల్‌
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆందోల్‌ ఎమ్మెల్యే శాంతి క్రాంతి కిరణ్‌ అన్నారు. శనివారం రైతు దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని రైతు వేదిక వద్ద ఆయన రైతులనుద్దేశించి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు బంధువు అని రైతు పక్షపాతి అన్నారు. మండల పరిధిలోని కాదులూరు గ్రామంలో దశాబ్ది వేడుకల్లో భాగంగా రైతు దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులకు రైతు బీమా రైతు బంధు రుణమాఫీ అనేక పథకాలను తీసుకువచ్చిన సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు.
నవతెలంగాణ-పెద్ద శంకరంపేట్‌
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం పెద్ద శంకరం పేటలో నిర్వహించిన రైతు దినోత్సవ ర్యాలీలో నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి పాల్గొన్నారు. రైతులు తమ ఎద్దుల బండ్లను అందంగా అలంకరించి పెద్ద శంకరంపేటలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడ విధంగా తెలంగాణలో రైతులకు సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రవి ప్రసాద్‌ పేట ఎంపీపీ జంగం శ్రీనివాస్‌ పేట సర్పంచ్‌ అలుగుల సత్యనారాయణ వైస్‌ ఎంపీపీ లక్ష్మీ రమేష్‌ ఎంపీటీసీలు వీణ సుభాష్‌ గౌడ్‌ దత్తు దామోదర్‌ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కుంట్ల రాములు మాజీ ఎంపీపీ బాసడ రాజు నాయకులు వేణుగోపాల్‌ గౌడ్‌ పున్నయ్య నారాయణ ఆర్యన్‌ సంతోష్‌ కుమార్‌ సుర్య ప్రకాష్‌, ఎంపీడీవో రఫిక్‌ ఉన్నిసా ఎపిఎం గోపాల్‌ ఏఈఓ స్వాతి అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
నవ తెలంగాణ-నర్సాపూర్‌
రైతు ఉన్నతికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పెద్ద పీట వేస్తుందని. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్ర గౌడ్‌ అన్నారు. శనివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా, రెండవ రోజు దశాబ్ద ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని ఆవంచ, ఇబ్రహీంబాద్‌, లింగాపూర్‌, రెడ్డిపల్లి గ్రామాలలో ఉన్న రైతు వేదికరులతోపాటు, నర్సాపూర్‌ పట్టణంలోని రైతు వేదికను, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్ర గౌడ్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం నర్సాపూర్‌ పట్టణంలోని చిల్డ్రన్‌ పార్కులో ,ఏర్పాటు చేసిన సభలో రైతుల ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలోసీఎం కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్‌ డి ఎ పి డి శ్రీనివాస్‌, జడ్పీటీసీ బబ్యా నాయక్‌, పిఎసిఎస్‌ చైర్మన్‌ రాజు యాదవ్‌, నర్సాపూర్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నహీముద్దీన్‌, మండల పరిషత్‌ వైస్‌ ఎంపీపీ వెంకట నర్సింగ్‌ రావు , మాజీ ఆత్మ కమిటీ చైర్మన్‌ శివకుమార్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షులు భోగచంద్రశేఖర్‌, ఏడిఏ సురేఖ, ఏవో అనిల్‌ కుమార్‌, నాయకులు తంబళ్ల బిక్షపతి, కుమ్మరి నాగేష్‌, ఆంజనేయులు గౌడ్‌, సర్పంచులు గడ్డమీది పోచమ్మ లక్ష్మయ్య, జనుముల నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-వెల్దుర్తి
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉమ్మడి మాసాయిపేట వెల్దుర్తి మండలాల్లో ఉన్న అన్ని గ్రామపంచాయతీలో రైతు వేదికల్లో గ్రామపంచాయతీ కార్యాలయాల్లో రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ రైతు సభలు ఆయాగ్రామాల సర్పంచ్‌ల అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభకు నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీత లక్ష్మారెడ్డి, పిఎసిఎస్‌ చైర్మన్‌ అనంత రెడ్డి ఎంపీపీ స్వరూప నరేందర్‌ రెడ్డి, జెడ్పిటిసి రమేష్‌ గౌడ్‌ వివిధ మండల స్థాయి అధికారులతో సభ నిర్వహించారు. ఈ సభకు రైతులు ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు అలంకరించి రైతు వేదికల వరకు భాజభజంత్రాల మధ్య ఎదురేగి ఏర్పాటు చేసిన సభ వరకు ఆహ్వానించారు. అనంతరం రైతు వేదికలను ప్రారంభించారు. అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్పర్సన్‌ సునితా లక్ష్మా రెడ్డిలు మాట్లాడారు. 9 ఏళ్ల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో అభివద్ధి చెందిందని సబ్బడ వర్గాలకు చేయూతనిచ్చి ఆదుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మోహన్‌ రెడ్డి నర్సాపూర్‌ కోఆప్షన్‌ మెంబర్‌ మన్సూర్‌ ఎంపీడీవో వెంకట లక్ష్మమ్మ పిఎసిఎస్‌ చైర్మన్‌ అనంతరెడ్డి, తహసీల్దార్‌, నాగవర్ధన్‌ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్‌ రైతులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నవతెలంగాణ- కొల్చారం
రైతుల శ్రేయస్సు కోసమే రైతు వేదికలను ప్రారంభిస్తు న్నామని నర్సాపూర్‌ ఎమ్మెల్యే చిలుముల మదన్‌ రెడ్డి అన్నారు. శనివారం రాష్ట్ర అవతరణ శాబ్ది ఉత్సవాల్లో భాగంగా కొల్చారం మండల వ్యాప్తంగా ఐదు రైతు వేదికల్లో నిర్వహించిన రైతు దినోత్సవ సదస్సులో పాల్గొని మాట్లాడారు. రైతు సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలు నిర్మించడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా సదస్సుకు హాజరైన రైతులు ధాన్యం కొనుగోళ్లలో అధిక తూకం, రైస్‌ మిల్లుల దోపిడీ, సకాలంలో రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ కాకపోవడంపై తమ ఆవేదనను ఎమ్మెల్యేకు వెల్లబోసుకున్నారు. రైతులకు నచ్చజెప్పేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు నానా తంటాలు పడవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా ఐదు క్లస్టర్ల పరిధిలోని రంగంపేట, పోతంశెట్టిపల్లి, కొల్చారం, పైతర, ఎనగండ్ల గ్రామాల్లోని రైతు వేదికల వద్ద రైతు దినోత్సవ సదస్సులను నిర్వహించారు. ఎనగండ్లలో ఎంపీపీ మంజుల, పైతర లో జడ్పీటీసీ మేఘమాల జ్యోతి ప్రజ్వలన వెలిగించి సదస్సులను ప్రారంభించారు. పై రెండు గ్రామల్లో నూతనంగా నిర్మించిన రైతు వేదికలను ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి రిబ్బన్‌ కట్‌ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సదస్సులను దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాతియని, రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కష్టపడుతూ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. దేశంలోనే ఈ పథకాలకు ప్రత్యేక గుర్తింపు ఉందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా ప్రభుత్వం పనిచేస్తుందన్న దీమాను రైతులకు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ మల్లారెడ్డి, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ రమేష్‌ కుమార్‌, మండల రైతు సమన్వయ కమిటీ మండల కన్వీనర్‌ భూపాల్‌ రెడ్డి, మెదక్‌ మార్కెటింగ్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ సావిత్రి రెడ్డి,ఎంపీడీఓ గణేష్‌ రెడ్డి, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ రావు, ఆత్మ మాజీ చైర్మన్‌ మల్లారెడ్డి, బీఆర్‌ఎస్‌ యువనాయకుడు రవితేజ రెడ్డి, ఆత్మకమిటి డైరెక్టర్‌ ఆంజనేయులు, మండలంలోని గ్రామాల సర్పంచులు, ప్రాదేశిక సభ్యులు, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.