– తక్కువ ధరకు రైతుల వద్ద కొని కొనుగోలు కేంద్రాలకు విక్రయం…
– తూకాలు, ధరల్లోను భారీవ్యత్యాసం
– నష్టపోతున్న అన్నదాతలు
నవతెలంగాణ – కాటారం
కాటారం మండలంలోని దామరకుంట, విలాసాగర్, జాదురావుపేట, ధర్మసాగర్, గుండ్రాత్‌పల్లి గ్రామాల్లో కొనుగోళ్లకు దళారుల హంగామా చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న లారీల కొరత, కాంటాల జాప్యం దళారులకు వరంగా మారుతు న్నాయి. రైతుల దగ్గర తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకుగాను ఏర్పాటు చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దళా రులు, మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యాన్ని తామే కొన్నట్లు రికార్డులు రాసుకుని ప్రభుత్వం నుంచి కమిషన్లు తీసుకో వడానికే మ్యాక్స్, డీసీఎంఎస్ కేంద్రాలు పరిమితమ య్యాయి. దీని వల్ల ఒక్కొక్క రైతు వేలాది రూపాయలు నష్ట పోతుండగా దళారు లక్షలు వెనుకేసుకుంటున్నారు. ప్రభు త్వం రైతులకు రెండు వేలకు పైగా మద్దతు ధర వేసిస్తు న్నప్పటికీ రైతులు మాత్రం దళారులను ఆశ్రయించే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం రైతుల కోసం మండలంలో ధాన్యం కొ నుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. సకాలంలో రైతులకు డబ్బు లు అందడం లేదని కొంతమంది రైతులు దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న దళారులు డబ్బులు వెంటనే చెల్లిస్తామంటూ ఆశ చూపించి క్వింటాల్ కు 1700 నుండి 1800 వరకు దళారులు కొనుగోలు చేసుకుంటు న్నారు. తిరిగి దళారి వ్యాపారుల ధాన్యాన్ని మొత్తాన్ని ప్రభు త్వం ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలిస్తున్నారు. రూ.2000పైగా మద్దతు ధరను దళారులు తీసుకుంటు న్నారు. రైతు నుండి ధాన్యాన్ని సేకరించి అమ్ముకుంటే క్విం టాలుకు రూ.300 నుండి రూ.400 వరకు లాభం వస్తుంది. అందుకే దళారులు డబ్బులు అవసరం ఉన్న రైతు లను సంప్రదించి వారీ ఆసరాను సొమ్ము చేసుకుం టున్నారు. ప్రభుత్వం ఇలాంటి వారిపై తగిన చర్యలు తీసుకొని పెద్ద ఎత్తున తీసుకువచ్చే దళారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దళారులను కట్టడి చేసి రైతులకు న్యాయం చేయాలని పలువురు కోరుతు న్నారు. రైతుల నుండి తీసుకుంటున్న ధాన్యానికి త్వరలోనే డబ్బులు చెల్లించే విధంగా అధికారులు చొరవ చూపాలి అన, అప్పుడే ధాన్యం పక్కదారి పట్టకుండా నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకు వస్తారని, లేదంటే ఇలాగే ధాన్యం మొత్తం దళారుల పాలు అయ్యా అవకాశాలు ఉన్నాయని వాపోతున్నారు.