పంట కాలువల మరమ్మత్తుల పై చర్చించిన తాడి బిలోలి రైతులు

నవతెలంగాణ-రెంజల్:
రెంజల్ మండలం తాడి బిలోలి గ్రామంలో చెరువు నుంచి చివరి ఆయకట్టు వరకు నీటిని అందించే విషయంలో స్థానిక రైతన్నలు రైతన్నలు గ్రామ పంచాయతీ ఆవరణలో చర్చించారు. చేతికి వచ్చిన పంటను కాపాడుకోవడానికి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో 25 వేల రూపాయలను ఖర్చు చేసి పంట కాలువ మరమ్మత్తులను చేపట్టాలని తీర్మానించారు. దీని ద్వారా సుమారు 500 ఎకరాలకు సాగునీరు అందించవచ్చని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు మౌలానా, వెల్మల నరసయ్య, జి.సాయి రెడ్డి, లింగాల అబ్బన్న, లింగారెడ్డి, నారాయణరెడ్డి, స్థానిక రైతన్నలు పాల్గొన్నారు.