తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన రైతులు

నవతెలంగాణ-అశ్వాపురం
తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని మొండికుంట ప్రాంతానికి చెందిన రైతులు శుక్రవారం ఆర్‌అండ్‌బి ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. అదేవిధంగా తేమశాతంతో సంబంధం లేకుండా రైతుల ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలన్నారు. తేమ శాతం పేరుతో కల్లాలలో దాన్యం రాశులు పెద్ద ఎత్తున పేరుకుపోవడంతో అకాల వర్షాల వలన తీవ్ర నష్టాలు గురికావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు గంటపాటు ధర్నా కొనసాగడంతో రోడ్డు కిరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచాయి. విషయం తెలిసిన వెంటనే మండల వ్యవసాయ అధికారి సాయి శాంతన్‌ కుమార్‌ ఆందోళన నిర్వహిస్తున్న రైతుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడి ధర్నాను విరమింప చేశారు.