రైతు సమస్యలు పరిష్కరించాలి…

నవతెలంగాణ – వీణవంక
రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు రామిడి ఆదిరెడ్డి అధ్యక్షతన శుక్రవారం మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కోసం నిర్మించిన చెక్ డ్యాంలను పునర్నిర్మాణం చేసి సాగునీరందించాలని తీర్మాణం చేశారు. అలాగే పంట నష్టపోయిన రైతులకు రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకూ నష్టపరిహారం అందలేదని, తక్షణమే పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ చేసి నాణ్యమైన విత్తనాలు అందజేయాలని, భూ సార పరీక్షలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా రైతుల సంక్షేమం కోసం పలు తీర్మాణాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సిహెచ్ నరసింహ రాజు, అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతంరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బత్తిని నరేష్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి ఆలేటి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు ముత్యాల రవీందర్, సముద్రాల దామోదర్, గర్వందుల శ్రీనివాస్, కిసాన్ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి మారం తిరుపతి రెడ్డి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు చిట్టి రెడ్డి కొండాల్ రెడ్డి, సర్పంచులు ఎనగంటి విజయ శ్రీనివాస్, గాలేటి జ్యోతి సురేందర్ రెడ్డి, గాజుల సమ్మయ్య,సింగిల్ విండో డైరెక్టర్ కొలిపాక తిరుమల్, కంకణాల సంతోష్, పూదరి అనిల్ తదితరులు పాల్గొన్నారు.