రైతులకు పట్టా పాస్ బుక్కు ఇవ్వాలి..

నవతెలంగాణ-ధర్మసాగర్ 
దేవనూరు గ్రామ రైతులకు పట్టా పాస్ బుక్కులు ఇవ్వాలని  కలెక్టర్ సిక్తా పట్నాయక్ గారిని సోమవారం హనుమకొండ బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు  గుడి వెనక దేవేందర్ కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో హనుమకొండ జిల్లా  కలెక్టర్ సీక్తా పట్నాయక్ నీ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసిన దేవునూరు గ్రామ రైతులు కలిసి మాట్లాడారు.ధర్మసాగర్ మండలం దేవునూరు గ్రామ రైతులు సుమారు 100 మంది రైతులు ఈరోజు సర్వే నెంబర్ 531 536 లో గల భూమి 1991 92 మధ్యకాలంలో ఇచ్చిన లావణ్ పట్టాల గురించి,మాకు పాస్ బుక్కులు ఇవ్వాలని రైతులందరూ కోరగా కలెక్టర్ సిక్తా పట్నాయక్  మరియు ఆర్డీవో వాసు చంద్ర గారి కోరారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించి మీ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఆర్డిఓ వాసు  చంద్ర మాట్లాడుతూ లావను పట్టా ఉన్నవారికి సంబంధిత అధికారులు,మేము సర్వే కు వచ్చినప్పుడు మొక పై ఉండాలి అని రైతులకు చెప్పడం జరిగింది.రైతులందరికీ ముందు నిలబడి కలెక్టర్ మరియు ఆర్డీవో  గారితో  మాట్లాడి రైతుల సమస్య వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ గారిని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దేవనూరు గ్రామ రైతులు ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.