
2023 జూన్ 18వ తారీకు లోపు కొత్తగా పట్టేదార్ పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు, రైతు బీమా కోసం ఆయా గ్రామాల వ్యవసాయ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సోమవారం మండల వ్యవసాయ అధికారి సోమ హరీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునే రైతులు రైతు బీమా దరఖాస్తు ఫారం, పటేదార్ పాస్ బుక్కు, ఆధార్ కార్డ్, నామిని ఆధార్ కార్డు జిరాక్స్లతో గ్రామ వ్యవసాయ అధికారి వద్ద దరఖాస్తు చేసుకోవాలని, ఈ అవకాశం ఆగస్టు 5వ తేదీ లోగా రైతులు దరఖాస్తు చేసుకొని, రైతు బీమా సదుపాయం పొందాలని సూచించారు.