పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

నవతెలంగాణ – మాక్లూర్
అధిక వర్షాలకు నష్టపోయిన పంటల రైతులను ఆదుకోవాలని తహశీల్దార్ శంకర్ కు తెలంగాణ రైతు కులి సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కురిసిన అధిక వర్షాలకు మాక్లూర్  మండలంలో దాదాపు  2950  ఎకరాలు పంటలు నీటమునిగాయి. కొన్ని చోట్ల ఇసుక మేటలు పడ్డాయి. దీంతో చిన్న సన్నకారు రైతులు దీనాస్థితిలో ఉన్నారన్నారు. అధిక వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం తక్షణం  ఎకరాకు రూ. 20 వేల ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అధిక వర్షాలకు, వరదలకు జిల్లా వ్యాప్తంగా 70 వేల కుండపోతగాఎకరాల్లో పంటలు మునిగిపోయాయని ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదికన జరిగిన నష్టాన్ని అంచనా వేసి నష్టపోయిన పంటలకు ఆహార ధాన్యాలు అయితే ఎకరాకు రూ. 10 వేల రూపాయలు, వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.20,000లు చెల్లించాలని డిమాండ్ చేశారు. అధిక వర్షాలు, వరదల వలన వరి, మొక్కజొన్న, కూరగాయలు, పంటలు మునిగి పోయాయని అన్నారు. రాష్ట్రంలో పంటల బీమా లేకపోవడం వల్ల రైతులకు భరోసా లభించడం లేదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వలన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న మార్పుల వల్ల ఏటా లక్షల ఎకరాల్లో పంటల నష్టం జరుగుతుందని అన్నారు. ఇందులో కౌలు రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందని అన్నారు. తక్షణం వ్యవసాయాధికారులు, రెవెన్యూ అధికారులు జరిగిన నష్టాలపై అంచనా వేసి కేంద్ర బృందాన్ని పిలువాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించడానికి 15వ ఫైనాన్స్ కమీషన్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాలని తెలిపారు. ప్రభుత్వం జరిగిన నష్టంపై స్పందించకపోతే రైతాంగాన్ని కూడగట్టి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కుండ పోతగా   కురుస్తున్న వర్షానికి చెరువులు వాగులు నిండుగా నిండి తెగిపోయి వర్షానికి పొలాలు దెబ్బ తిన్నాయని అన్నారు.  వరి వేసినప్పటికిని ఎకరానికి రూ. 25 వేల చొప్పున ఖర్చయిందని రైతులు ఆవేదన తెలిపారని అన్నారు. ప్రభుత్వం వెంటనే నష్టపోయిన పొలాలను సోయాబీన్, కూరగాయల అన్ని రకాల పంటలను సర్వే చేసి నష్టపరిహారం కింద ఎకరానికి రూ.20 వేలు ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం గా డిమాండ్ చేశారు.  కప్పేశాయని అన్నారు ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి రైతులకు ఎకరానికి 20,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు సాయిలు, కిషన్ , శంకర్ తదితరులు పాల్గొన్నారు.