ఎమ్మెల్యే కృషితోనే 18వ డివిజన్ లో వేగంగా అభివృద్ధి పనులు

సిసి రోడ్ నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న కార్పొరేటర్ బాదే అంజలీదేవి
సిసి రోడ్ నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న కార్పొరేటర్ బాదే అంజలీదేవి
నవతెలంగాణ-యైటింక్లైన్ కాలనీ:
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కృషి తోనే 18 వ డివిజన్ లో వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కార్పొరేటర్ బాధే అంజలీదేవి అన్నారు. సుమారు 10 లక్షల రూపాయల అంచనా వ్యయంతో అల్లూరులోనీ మిలీనియం స్కూల్ గల్లీలో సీ సీ రోడ్డు నిర్మాణానికి ఆమె భూమి పూజ చేసారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజన్ ఉన్న నాయకుడు ఎమ్మెల్యే గా ఉంటే అభివృద్ధి ఇలాగే ఉంటుందని దానికి ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే నిదర్శనమని ఆమె కొనియాడారు. రామగుండంకు అత్యధిక నిధులు కేటాయిస్తూ మాడల్ రామగుండంగా తీర్చిదిద్దుటకు అనుక్షణం తపన పడుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు బీనవేని రవి గౌడ్,పోతుల రాజమల్లు, మడక సంపత్ తదితరులు పాల్గొన్నారు.