నవ తెలంగాణ- నవీపేట్: ప్రజా సమస్యలను పరిష్కరించే పార్టీలను, అభ్యర్థులనే ఆదరించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందాయని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే వారినే గెలిపించాలని అన్నారు. మతతత్వ శక్తులను అడ్డుకోవాలని సూచించారు. నిత్యవసర ధరలు పెంచడంతో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయని కాబట్టి ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు గణేష్, సందీప్, పవన్, కార్తీక్, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.